గ్రహం అనుగ్రహం

గ్రహం అనుగ్రహం - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

గ్రహం అనుగ్రహం
శీ విళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.అష్టమి సా.5.46 వరకు, తదుపరి నవమి, నక్షత్రం చిత్త ప.1.16 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం రా.6.55 నుంచి 8.32 వరకు దుర్ముహూర్తం ఉ.8.12 నుంచి 9.04 వరకు, తదుపరి ప.12.32 నుంచి 1.23 వరకు, అమృతఘడియలు ఉ.6.55 నుంచి 8.32 వరకు.

సూర్యోదయం           :  5.38
సూర్యాస్తమయం           :  6.34
రాహుకాలం :  ఉ 10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం

మేషం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి స్నేహితుల కలయిక. ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. 

వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. విద్యార్థులు మరింత శ్రమపడాలి. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

సింహం: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కన్య: రుణాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోⶠ పరిస్థితి.

తుల: కొన్నిసమస్యలు పరిష్కరించుకుంటారు. సోదరులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి ఉంటుంది.

వృశ్చికం: కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

ధనుస్సు: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. సోదరులు, సోదరీలతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మకరం: రుణబాధలు తొలగుతాయి. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. శ్రమాధిక్యం. బంధువర్గంతో అకారణంగా వివాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు,, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: కుటుంబసమస్యలు. శారీరక రుగ్మతలు. బంధువులతో వైరం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
– సింహంభట్ల సుబ్బారావు 

నమాజ్‌ వేళలు
ఫజర్‌    :    4.32
జొహర్‌    :    12.22
అసర్‌    :    4.55
మగ్రీబ్‌    :    6.53
ఇషా    :    8.13

Advertisement
Advertisement
Back to Top