Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Neet Ug Counseling Latest Update1
ఆగస్ట్‌ 14 నుంచి .. నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌

ఢిల్లీ: నీట్‌ యూజీ కౌన్సిలింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ ఆగస్ట్‌ 14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆగస్ట్‌ మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కౌన్సిలింగ్‌పై అప్‌డేట్స్‌ను ఎంసీసీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించింది. ఈ మేరకు నీట్ అభ్యర్థులకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఒక నోటీసు విడుదల చేసింది.

 Chandrababu U Turn On Ap Comprehensive Land Survey2
సమగ్ర భూ సర్వే పై చంద్రబాబు యూటర్న్

సాక్షి, అమరావతి : సమగ్ర భూ సర్వేపై సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తు­న్నట్లు గతంలో ప్రకటించిన చంద్రబాబు.. మళ్లీ దాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం హయాంలో సమగ్ర భూ సర్వేకి శ్రీకారం చుట్టగా. ఇప్పుడు అదే సర్వేని కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు సమగ్ర భూ సర్వేపై రెవెన్యూ శాఖ మంత్రి అనగానికి సత్యప్రసాద్‌ స్పందించారు. సమగ్ర సర్వేను మిగిలిన గ్రామాల్లోనూ చేపడతామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. గతంలో చేసిన సర్వేపై గ్రామ సభలు పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.. ‘రీ సర్వే 7 వేల గ్రామాల్లో పూర్తి అయ్యింది. 5 శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తాం. ఆ తర్వాత మళ్ళీ రీ సర్వేని ముందుకు తీసుకుని వెళతాం’ అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.గతంలో సమగ్ర సర్వేపై చంద్రబాబు ఏమన్నారంటేరాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తు­న్నట్లు గతంలో నారా చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన హయాంలో ఒకసారి రీ సర్వే చేయాలని భావించామని, కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోతుండటంతో ముందుకు వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్‌ సర్కారు కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శాశ్వత భూహక్కు­–భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీ సర్వేను చేపట్టిందని విమర్శించారు. ఇకపై భూ యజ­మానులు వచ్చి తమ హద్దులు నిర్ణయించాలని కోరితే మినహా ఎవరికీ సర్వే చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు అదే సమగ్ర భూ సర్వేపై చంద్రబాబు యూటర్న్‌ తీసుకోవడం గమనార్హం.

Satwiksairaj Rankireddy-Chirag Shetty create history, enter Olympics quarterfinals3
పారిస్ ఒలింపిక్స్‌.. క్వార్టర్స్‌కు చేరిన సాత్విక్‌- చిరాగ్ జోడీ

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి- చిరాగ్‌ శెట్టి అద‌ర‌గొట్టారు. బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్ జంట అడుగుపెట్టింది. త‌ద్వారా ఓ అరుదైన ఘ‌న‌త‌ను ఈ స్టార్ భార‌త జోడీ త‌మ పేరిట లిఖించుకున్నారు. ఒలింపిక్స్ చ‌రిత్ర‌లోనే బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో క్వార్ట‌ర్స్‌కు చేరిన తొలి భార‌త జోడీగా వీరిద్ద‌రూ రికార్డు సృష్టించారు. ఇండోనేషియాకు చెందిన అల్ఫియన్- ఫజార్ చేతిలో 21-13, 21-10 తేడాతో ఫ్రెంచ్ ద్వయం లాబార్-కోర్వీ ఓడిపోవడంతో సాత్విక్‌-చిరాగ్ క్వార్టర్స్ బెర్త్ ఖారారైంది.కాగా సోమవారం నాటి రెండో మ్యాచ్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జంట జర్మనీ జోడీ మార్విన్‌ సీడెల్‌- మార్క్‌ లామ్స్‌ఫస్‌తో తలపడాల్సింది. అయితే, మార్క్‌ మోకాలి గాయం కారణంగా ఈ జర్మనీ ద్వయం​ పోటీ నుంచి తప్పుకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు. ఈ క్ర‌మంలో క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు భార‌త జోడీ చేరాలంటే మంగ‌ళ‌వారం ఇండోనేషియా జంటపై త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంతలోనే సోమ‌వారం జ‌రిగిన‌ సెకెండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ జోడీని ఇండోనేషియా ద్వ‌యం ఓడించడంతో భార‌త్ క్వార్ట‌ర్ట్‌కు మార్గం సుగ‌మ‌మైంది. ఫ్రాన్స్ ఇంటి ముఖం ప‌ట్ట‌డంతో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ సి పాయింట్ల పట్టికలో సాత్విక్‌- చిరాగ్ పెయిర్ రెండో స్ధానంలో నిలిచింది. ఈ జోడీ తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో మం‍గళవారం ఇండోనేషియా జంట ఫజర్‌ అల్ఫియాన్‌- మహమ్మద్‌ రియాన్‌ ఆర్టియాంటోతో తలపడనుంది.భార‌త్- అర్జెంటీనా హాకీ మ్యాచ్ డ్రాభారత్‌- అర్జెంటీనా పురుషుల హాకీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1 సమంగా గోల్స్ చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ చివరి నిమిషంలో గోల్ కొట్టి భారత్‌ను ఓటమి నుంచి తప్పించాడు. భారత తమ తదుపరి మ్యాచ్‌లో జూలై 30న ఐర్లాండ్‌తో ఆడనుంది.

Argument Between Padi Kaushikreddy Minister Seethakka In Assembly4
సీతక్కపై పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు.. అసెంబ్లీలో దుమారం

సాక్షి,హైదరాబాద్‌: మహిళలకు ఉచిత బస్సు స్కీమ్‌పై తెలంగాణ అసెంబ్లీలో సోమవారం(జులై 29) దుమారం రేగింది. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ క్రమంలో మంత్రి సీతక్కకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు, ఆర్టీసీ కార్మికులకు ఏం చేసిందో నాలెడ్జ్‌ లేకపోవచ్చని కౌశిక్‌రెడ్డి అన్నారు. నాలెడ్జ్‌ లేదు అన్న మాటలపై కాంగ్రెస్‌ సీరియస్‌ అయింది. నాలెడ్జ్ లేదు అన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పాలి లేదా ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. స్పీకర్ కలుగజేసుకోవడంతో సీతక్కపై మాట్లాడిన మాటలను కౌశిక్‌రెడ్డి వెనక్కి తీసుకున్నారు.

YSRCP MP Mithun Reddy Speech In Loksabha On Budget5
‘సూపర్‌సిక్స్‌’ అమలు ఎప్పుడు?: లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి

సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సారీ సిక్స్ గా మార్చవద్దని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. సోమవారం(జులై 29) లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఏపీలో సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ అమలుకు గడువు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. శాంతిభద్రతలు లేకుండా పెట్టుబడులు ఎలా..ఏపీలో శాంతిభద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయి. నా నియోజకవర్గంలో నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. నాపైన దాడి చేశారు. నా వాహనాన్ని ధ్వంసం చేశారు. అన్ని టీవీ చానల్స్ చూస్తుండగానే దాడి జరిగింది. నాపైనే దాడి చేసి నాకు వ్యతిరేకంగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడాలి. హింసకు చరమ గీతం పాడాలి. అమరావతికి రుణం వద్దు.. గ్రాంట్‌గా కావాలి..పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి బాధ్యులు ఎవరు. అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్లు రుణంగా కాకుండా గ్రాంట్‌గా ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. పదేళ్లు గడిచిన విశాఖ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. బడ్జెట్‌లో రూ. 11 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించవద్దు’అని మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

Happy Friendship Day 2024 send a selfie with your Fried and celebrate with sakshi 6
‘దోస్త్‌ మేరా దోస్త్‌’తో సెల్ఫీ సంబరం

‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ ఈ ప్రపంచంలో ఎవ్వరైనా ఈ మాటల్ని వింటే పులకించి పోవాల్సిందే. అదీ స్నేహం గొప్పతనం. స్నేహానికి కులం, మతం, ప్రాంతం, భాష, లింగ భేదాలేవీ వుండవు. ఉన్నదంతా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడమే. దోస్త్‌ అంటే వీడేరా అనిపించేంత బంధం. మరి ‘దోస్త్ మేరా దోస్త్ తుహై మేరీ జాన్.. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం’’ అనుకునేంత గొప్ప దోస్తులు మీ జీవితంలో ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం అలాంటి నిజమైన స్నేహితుడితో సంతోష క్షణాలను మళ్లీ గుర్తు చేసుకోండి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ దోస్తుతో సెల్పీ దిగి సాక్షి. కామ్‌కు పంపించండి. ‘దోస్త్‌ మేరా దోస్త్‌’ సెల్పీ 9182729310 నెంబరుకు వాట్సాప్‌ చేయండి. ఆ ఫొటోలను సాక్షి డాట్‌ కామ్‌లో ప్రచురిస్తాం. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడమే కాదు.. ఈ జ్ఞాపకాన్ని కలకాలం పదిల పర్చుకోండి. ఫ్రెండ్‌షిప్‌ డే గురించి ఇవి మీకు తెలుసా?అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ ప్రతిపాదన 1958 జూలై 30న పరాగ్వేలో మొదలైంది. వరల్డ్ ఫ్రెండ్‌షిప్ డే ఆలోచనను తొలిసారి 1958, జూలై 20న పరాగ్వేలో స్నేహితులతో విందు సందర్భంగా డాక్టర్ ఆర్టెమియో బ్రాచో ప్రతిపాదించారు.ఐక్యరాజ్యసమితి 2011లో జూలై 30ని అధికారిక అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని వివిధ దేశాలలో వేర్వేరు రోజులలో జరుపుకుంటారు. భారతదేశంలో ఆగస్టు నెలలోని తొలి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఇంటర్నేషనల్‌ ఫ్రెండ్‌షిప్‌ డేను(జులై 30ని) కూడా ఫాలో అవుతోంది ఇండియా.మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్, బంగ్లాదేశ్‌తో సహా ఇతర దేశాలలో జూలై 30న జరుపుకుంటారు.

Interesting Facts About India First Pilot Jehangir Ratanji Dadabhoy Tata7
పారిశ్రామిక దిగ్గజం.. ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి

భారతీయ దిగ్గజ సంస్థ 'టాటా గ్రూప్' నేడు ఈ స్థాయిలో ఉందంటే దాని వెనుక ఎంతోమంది కృషి ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి 'జేఆర్‌డీ టాటా' (జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్ టాటా). 1904 జులై 29న జన్మించిన ఈయన సుమారు 53 సంవత్సరాలు టాటా గ్రూప్ సంస్థకు ఛైర్మన్‌గా ఉన్నారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే కంపెనీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.జేఆర్‌డీ టాటా ఛైర్మన్‌గా ఉన్న కాలంలోనే టీసీఎస్, టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టైటాన్ వంటి విజయవంతమైన వెంచర్‌లతో సహా 14 కొత్త కంపెనీలను ప్రారంభించారు. అంతే కాకుండా 1956లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) తరహాలో టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (TAS)ని స్థాపించారు.జేఆర్‌డీ టాటా సంస్థలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం విరివిగా విరాళాలు అందించారు. రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని అనే భావన ప్రవేశపెట్టిన ఘనత జేఆర్‌డీ టాటా సొంతం. అంతే కాకుండా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య సేవలు, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ప్రారంభించారు. ప్రమాదాల సమయంలో కార్మికులకు నష్టపరిహారం అందించే విధానం కూడా ఈయనే మొదలుపెట్టారు.1936లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) స్థాపించారు. ఆ తరువాత 1945లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR), నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌ కూడా స్థాపించారు. 1968లో టాటా కంప్యూటర్ సెంటర్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) స్థాపించారు. నేడు ఈ కంపెనీ భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది. ఆ తరువాత 1987లో టైటాన్‌ను స్థాపించారు.15 సంవత్సరాల వయసులోనే ఫైలట్ కావాలని, విమానయాన రంగంలో వృత్తిని కొనసాగించాలని నిశ్చయించుకున్న జేఆర్‌డీ టాటా 24 ఏళ్ల వయసులో ఫ్లయింగ్ లైసెన్స్ పొందారు. దీంతో ఈయన భారతదేశంలో మొట్టమొదటి ఫ్లయింగ్ లైసెన్స్ పొందిన వ్యక్తిగా నిలిచారు. ఆ తరువాత టాటా ఎయిర్ సర్వీస్‌ ప్రారంభించారు. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే చివరికి ఈ సంస్థ మళ్ళీ ఎయిర్ ఇండియాగా టాటా గ్రూపులోకే వచ్చింది.టాటా గ్రూప్ అభివృద్ధికి మాత్రమే కాకుండా.. ఉద్యోగుల జీవితాల్లో కూడా మార్పులు తీసుకువచ్చిన జేఆర్‌డీ టాటా 1993 నవంబర్ 29న జెనీవాలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. పారిశ్రామిక రంగంలో ఈయన చేసిన కృషికి భారత ప్రభుత్వం భారతరత్న ప్రధానం చేసింది. దీంతో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందిన ఏకైక పారిశ్రామికవేత్తగా జేఆర్‌డీ టాటా చరిత్ర సృష్టించారు.

KSR Comment On Chandrababu Super Six Fear8
చంద్రబాబు-పవన్‌ ముందున్నది ఒకటే ఆప్షన్!

‘‘మనం హామీలు ఇచ్చాం.. సూపర్ సిక్స్ చెప్పాం.. చూస్తే భయమేస్తోంది. ముందుకు కదలలేకపోతున్నాం..ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి’’.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో చేసిన ప్రకటన. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈయన అన్న మాటలు గమనించండి.'ఇంకా సంపద సృష్టిస్తా..ఆదాయాన్ని పెంచుతా..ఈ పెంచిన ఆదాయం పేదవాళ్లకోసం ఖర్చు పెడతా.."అని బహిరంగ పభలలో చెప్పారు. అంతేకాదు..తల్లికి వందనం కింద ఎందరు పిల్లలుంటే అందరికి పదిహేనువేల చొప్పున ఇస్తాం. ఒకరుంటే ఒకరికి ,ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తా..ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తా..నలుగురు ఉంటే నలుగురికి ఇస్తా.."అని ఆయన చెప్పేవారు. మరి ఇప్పుడో.. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించింది ఎక్కడకు పోయిందో కాని, ప్రజలంతా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల గురించి ఆలోచించాలని చెబుతున్నారు. దీనిపైనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి కౌంటర్ ఇస్తూ చంద్రబాబు ఎప్పుడైనా ఒక మోడెస్ ఆపరేండి అమలు చేస్తారని, తొలుత హామీలు ఇచ్చేస్తారని, ఆ తర్వాత తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వాటిని అమలు చేయడం కష్టమని ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వ స్కీములపైన అయినా, ఎవరినైనా వ్యక్తిగతంగా హననం చేయాలన్నా ఇదే పద్దతి అవలంభిస్తారని జగన్ వ్యాఖ్యానించారు. చివరికి పిల్లనిచ్చిన మామ ఎన్.టి.రామారావును కూడా చంద్రబాబు వదలిపెట్టలేదని, ఆయనపై సైతం దుష్ప్రచారం చేశారని జగన్ పేర్కొన్నారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే విధానాన్ని చంద్రబాబు అవలంభిస్తున్నారు. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం పదమూడు లక్షల కోట్ల అప్పు చేసిందని తెగ ప్రచారం చేశారు. అయినా తనకు సూపర్ సిక్స్ అమలు చేయగల సత్తా ఉందని అనేవారు. జనం కూడా కొంతవరకు ఆయనను నమ్మారు. సీనియర్ కనుక, ఏదో సంపద అని అంటున్నారు కనుక ,దానిని సృష్టించి హామీలు అమలు చేస్తారులే అని జనం అనుకున్నారు. కానీ చంద్రబాబు తన పాత ఎగవేత స్కీమ్ నే యధా ప్రకారం అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆలోచన చేశారు. మొత్తం సమస్యలన్నిటికి జగన్ ప్రభుత్వమే కారణమని ప్రచారం ఆరంభించారు. ఏకంగా జగన్ ప్రభుత్వం వల్ల 12,96 లక్షల కోట్ల ఆర్దిక విధ్వంసం జరిగిందని కాకి లెక్కలు చెప్పారు. పోలవరం జాప్యం వల్ల రూ.45 వేల కోట్ల రూపాయల నష్టం. అమరావతివల్ల ఇంత నష్టం ..అంటూ ఏవేవో పిచ్చి లెక్కలు వేసి అసలు విషయాన్ని చల్లగా బయటపెట్టేశారు. తనకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని ఉందని, కాని ఆర్ధిక పరిస్థితి బాగోలేదని ,ప్రజలు అర్దం చేసుకోవాలని అంటున్నారు. ఇక అప్పుల మీద కూడా నోటికి వచ్చిన అంకెలను చెప్పి ప్రజలను నమ్మించాలని చూశారు. తొమ్మిది లక్షల డెబ్బైనాలుగువేల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పాలని ఆయన కోరారు. జగన్ 2.71 లక్షల కోట్ల డబ్బు బటన్ నొక్కి బదిలీ చేస్తే.. ఇంత అప్పు ఎందుకు అయిందని చంద్రబాబు అమాయకంగా ప్రశ్నించారు. మరి ఎన్నికలకు ముందు రూ. 13 లక్షల కోట్ల అప్పు అని ఎలా ప్రచారం చేశారని చంద్రబాబును ఎవరైనా ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది.నిజానికి రాష్ట్రాన్ని ఆర్ధికంగా విధ్వంసం చేయడానికి పూనుకుంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ లే.అందుకే బాద్యతారహితంగా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు. పైగా తమ అంత సమర్ధులు లేరని, సంపద సృష్టించి చూపుతామని కోతలు కోశారు.కాని ఇప్పుడు ఏమంటున్నారు. ప్రజలు ఆలోచించాలట. ఎమ్మెల్యేలు తమ ఆలోచనలు ప్రభుత్వానికి ఇవ్వాలట. ఇందుకోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తారట.గత ప్రభుత్వ హయాంలో క్షీణించిన శాంతిభద్రతలు , జరిగిన ఆర్ధిక అవకతవకలపై రాష్ట్రంలోని ప్రతి పల్లెలో చర్చ చేపడతారట. ఇంతకన్నా పచ్చి మోసం ఇంకొకటి ఉంటుందా?ఎన్నికల మానిఫెస్టోలో ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయల విలువైన హామీలు ప్రకటించినప్పుడు ఎవరిని అడిగి చేశారు?సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడు.. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని ఎలా చెప్పగలిగారు? అది దారుణమైన అసత్యమని తెలిసి కూడా అలాంటి వాగ్దానం చేయడం జనాన్ని మోసం చేయడం కిందకు వస్తుందా? రాదా?. చంద్రబాబు తన ఆత్మసాక్షిని అడిగి జవాబివ్వగలరా? చంద్రబాబు ఆత్మతో నిమిత్తం లేకుండా అబద్దాలను చెప్పగలరన్న వైఎస్సార్‌సీపీ నేతల విమర్శలకు సమాధానం ఇవ్వగలరా!. ఏడు శ్వేతపత్రాలపై రాష్ట్రం అంతా చర్చిస్తారట. ఇదే కొత్తగా చెబుతున్న పాత డ్రామా అన్నమాట. 1996 లోక్ సభ ఎన్నికలకు ముందు టీడీపీ గెలిస్తేనే మద్య నిషేధం, రెండు రూపాయలకే కిలో బియ్యం స్కీమ్, విద్యుత్ చార్జీల తగ్గింపు మొదలైనవి యధావిధిగా కొనసాగుతాయని ప్రచారం చేశారు. తీరా టిడిపికి సగం సీట్లు వచ్చాక, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు నిర్వహించి వాటన్నిటికి మంగళం పాడారు. ఇప్పుడు కూడా సరిగ్గా సూపర్ సిక్స్ ఎగవేతకు రంగం సిద్దం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎప్పుడైనా హామీల అమలు సాద్యాసాద్యాల మీద రాష్ట్రం అంతా చర్చ పెడతామని చెప్పలేదే!. కాని ఇప్పుడు హామీలను అమలు చేయలేకపోతున్నామని, దీనిపై ప్రజలంతా చర్చించి సలహాలు ఇవ్వాలని అంటున్నారు ఇంతకన్నా చీటింగ్ వేరే ఏమైనా ఉంటుందా?అని జగన్ ప్రశ్నించడంలో అర్దం ఉంది.ఎన్నికలకు ముందు జగన్ చాలా స్పష్టంగా చంద్రబాబు జనాన్ని మోసం చేయడానికి సూపర్ సిక్స్ అంటున్నారని నెత్తి,నోరు మొత్తుకుని చెప్పారు. చంద్రబాబు మాటను నమ్మరని ఆయన అనుకున్నారు. కాని ప్రజలు మాత్రం చంద్రబాబు ట్రాప్ లో చిక్కుకున్నారు.అదే ట్రాప్ ను ఇప్పటికీ ఆయన కొనసాగిస్తున్నారు.ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఈ మోసంలో భాగస్వామిగా ఉండడానికి ఏ మాత్రం సిగ్గుపడడం లేదు. జగన్ ఈ అంశాలను ప్రస్తావిస్తూ మొత్తం అప్పు 7.48లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. చంద్రబాబు 2019 లో దిగిపోయేనాటికి ఖజానాలో వంద కోట్లే మిగిల్చివెళితే, తాను 2024లో దిగిపోయేటప్పటికీ ఏడువేల కోట్ల నుంచి ఎనిమిదివేల కోట్ల రూపాయల నిధులు ఖజానాలో ఉన్నాయని, దీనిని బట్టి ఎవరు ఆర్దిక విధ్వంసానికి పాల్పడింది అర్ధం చేసుకోవచ్చని జగన్ వ్యాఖ్యానించారు. 2014 లో కూడా చంద్రబాబు రైతుల రుణాలన్నింటినీ రద్దు చేస్తానని నమ్మబలికారు. కాని చేయలేక చతికిలపడ్డారు. తిరిగి 2024లో కూడా అదే తరహా హామీలు ఇచ్చి మళ్లీ జనాన్ని మాయ చేయగలిగారు. చేసిన వాగ్దానాలకు బడ్జెట్ కేటాయించవలసి వస్తుందని, అది సాధ్యం కాదు కనుకే చంద్రబాబు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టలేకపోతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. సాధారణంగా ఎన్నికలు అయిన వెంటనే పూర్థిస్థాయి బడ్జెట్ పెడతారు. కాని చంద్రబాబు ఆ పని చేయలేకపోవడం బలహీనతగానే కనిపిస్తోంది. చంద్రబాబేమో తాను వాగ్దానాలను అమలు చేయడం కష్టం అన్న సంకేతలు ఇస్తూ, జగన్ పై మొత్తం కధను నెట్టేయడానికి బేషజం లేకుండా ప్రయత్నిస్తున్నారు. అదే జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నడూ డబ్బులు లేవని, కష్టాలు పడుతున్నానని, ప్రజలు సలహాలు ఇవ్వాలని కోరలేదు. తనతంటాలేవో తాను పడి ఆర్ధిక వనరులు సమకూర్చుకుని స్కీములు అమలు చేశారు. ఏపీని టీడీపీ నేతలు అరాచకానికి చిరునామాగా మార్చారని జగన్ విమర్శిస్తే.. లోకేష్ దానికి బదులు ఇస్తూ ఇంకా రెడ్ బుక్ తెరవలేదని అంటున్నారు. అంటే ఆ బుక్ ఓపెన్ చేయకముందే ఇంత ఆరాచకం చేస్తే, బుక్ తెరచి ఇంకెందరిపై ఘాతుకాలకు పాల్పడతారో అనే సందేహం సహజంగానే అందరిలో వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ముందున్నది ఒకటే ఆప్షన్.జనాన్ని ఎలా మోసం చేయాలన్నదే..జనాన్ని ఎలా అబద్దాలతో నమ్మించాలన్నదే. ప్రజలను ఎలా డైవర్ట్ చేయలన్నదే. అందుకే తన తప్పులన్నింటిని జగన్ పై తోసివేసి కథ నడపాలని రాష్ట్ర వ్యాప్త చర్చల డ్రామాకు తెరదీస్తున్నారు. జనం అంతా ఎగబడి తమకు ఈ స్కీములు వద్దని చెప్పాలన్నమాట. ఎవరైనా స్కీములు ఎందుకు అమలు చేయరని? అడిగితే వారిని రాష్ట్ర ద్రోహులుగా ముద్ర వేయాలన్నమాట!. ఈ రకమైన కొత్త వ్యూహంతో ఆంధ్రప్రదేశ్‌ను అబద్దాల ప్రదేశ్ గా మార్చడమే టీడీపీ ఎజెండా. దానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు నాయకత్వం వహిస్తున్నారన్నమాట.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Payal Rajput Latest Movie Rakshana Streaming On This Date9
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఇటీవల క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌ రక్షణ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో మెప్పించింది. ఈ ఏడాది జూన్‌ 7న థియేటర్లలో రక్షణ్‌ మూవీ రిలీజైంది. విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆహా సంస్థ ట్వీట్ చేసింది. లేడీ సింగ్‌ గర్జించేందుకు వస్తోంది అంటూ మూవీ పోస్టర్‌ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ ఏసీపీ పాత్రలో అలరించారు. కథేంటంటే.. కిరణ్‌(పాయల్‌ రాజ్‌పుత్‌) ఓ పవర్‌ఫుల్‌ ఏసీపీ. అనేక కేసులను ఈజీగా సాల్వ్‌ చేసిన కిరణ్‌.. తన స్నేహితురాలు హత్య కేసును మాత్రం ఛేదించలేకపోతుంది. ఓ సైకో ఆమెను హత్య చేసి..అది ఆత్మహత్యగా చిత్రీకరించాడని కిరణ్‌ అనుమానిస్తుంది. ఆ దిశగా విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు ప్రేమించమని అమ్మాయిల వెంటపడుతూ హింసించే అరుణ్‌(మానస్‌)ని కిరణ్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. దీంతో కిరణ్‌పై అరుణ్‌ పగపెంచుకుంటాడు. ఓ వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేసి అందులో కిరణ్‌ ఫోటోలను పోస్ట్‌ చేసి..ఆమె మొబైల్‌ నంబర్‌ని పబ్లిక్‌లో పెడతాడు. దీంతో కిరణ్‌కు అసభ్యకరమైన సందేశాలు..పోన్లు వస్తుంటాయి.ఇది అరుణ్‌ చేసిన పనే అని కనిపెట్టిన కిరణ్‌.. అతన్ని పట్టుకునేందుకు ఓ బంగ్లాకు వెళ్లగా..అరుణ్‌ ఆమె కళ్లముందే బంగ్లాపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఏసీపీ కిరణ్‌ వేధింపుల కారణంగానే చనిపోతున్నానని ఓ వీడియో కూడా చిత్రీకరిస్తాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో కిరణ్‌ సస్పెండ్‌కి గురవుతుంది. ఆ తర్వాత కిరణ్‌ లోతుగా విచారించగా.. తన స్నేహితురాలితో పాటు అరుణ్‌ ఆత్మహత్యల వెనుక ఎవరో ఒకరు ఉన్నారని, ఆయనే వీరిద్దరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్‌ ఎవరు? ఎందుకు తన స్నేహితురాలితో పాటు మరికొంతమంది యువతులను చంపాడు? అరుణ్‌కి ఆ సైకో కిల్లర్‌కి ఉన్న సంబంధం ఏంటి? కిరణ్‌ని లూజర్‌ చేయాలని ఎందుకు ప్రయత్నించాడు? ఆ సైకో కిల్లర్‌ని కిరణ్‌ కనిపెట్టిందా? చివరికి ఏం జరిగింది? ఈ కథలో రోష‌న్‌ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. Lady Singam is ready to roar!👮🏻‍♀️Payal's 'Rakshana' is coming on aha!!🎬 #Rakshana premieres Aug 1st only on aha @starlingpayal @ActorMaanas @RajeevCo @actorchakrapani @sivannarayana_ @PrandeepThakore pic.twitter.com/sOdDmVSHKz— ahavideoin (@ahavideoIN) July 29, 2024

Passenger Attack On Waiter In Vandebharat Express10
మాంసాహారం వడ్డన.. వందేభారత్‌ రైలులో వెయిటర్‌పై దాడి

కలకత్తా: వందేభారత్‌ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది. భోజనం అందించిన వెయిటర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు పశ్చిమ బెంగాల్‌లోని హవ్‌డా నుంచి రాంచీకి వందేభారత్‌ రైలులో ప్రయాణించాడు. భోజనం కోసం థాలీ ఆర్డర్‌ చేశాడు. అయితే ఒక వెయిటర్‌ పొరబాటున మాంసాహారం వడ్డించారు. ఆ వృద్ధ ప్రయాణికుడు కొద్దిసేపటికి అది నాన్‌-వెజ్‌ భోజనం అని గుర్తించాడు. Kalesh b/w a Passenger and Waiter inside Vande Bharat over A person slapped a waiter for mistakenly serving him non-vegetarian foodpic.twitter.com/Oh2StEthyX— Ghar Ke Kalesh (@gharkekalesh) July 29, 2024 శాకాహారి అయిన తనకు మాంసాహారాన్ని వడ్డించాడన్న ఆగ్రహంతో వెయిటర్‌పై దాడికి దిగాడు. ఎంతమంది అడ్డుకున్నా ఆగకుండా వెయిటర్‌పై చేయి చేసుకున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై తూర్పు రైల్వే స్పందించింది. ‘అవును, పొరబాటు జరిగింది. అంగీకరిస్తున్నాం. సమస్యను పరిష్కరించాం’అని క్లారిటీ ఇచ్చింది.

Advertisement
Advertisement
Advertisement
International View all
title
లెబనాన్‌లో యుద్ధమేఘాలు.. పౌరులకు భారత్‌ అడ్వైజరీ

న్యూఢిల్లీ: గాజాకు పరిమితమైన ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం తాజాగా

title
నార్త్‌ కొరియా: వరద సహాయక చర్యల్లో కిమ్‌

ప్యాంగ్‌యాంగ్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఖర

title
భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవుల అధ్యక్షుడు

మాలె: తమ దేశ రుణ చెల్లింపులను సులభతరం చేయటంలో మద్దుతు ఇచ్చిన

title
Bangladesh: ఎట్టకేలకు ఇంటర్నెట్‌ సేవలు.. మూడు రోజులు 5జీబీ డేటా ఫ్రీ

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై బంగ్లాదేశ్‌లో చెలరేగిన అందోళనలు సద్ద

title
ఇజ్రాయెల్‌కు హెచ్చరిక.. టర్కీ సంచలన నిర్ణయం!

అంకారా: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణా

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all